గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి

గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి

 రైతులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయి. అయితే ఎకరంలోపు ఉన్న రైతులకే మాత్రమే ఫిబ్రవరి 5న అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. చాలా మంది రైతులు అకౌంట్లో డబ్బులు పడ్డ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  చాలా రోజులకు రైతు భరోసా డబ్బులు పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఎకరంలోపు ఉన్న 17.03 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమచేస్తామని ఇవాళ ఉదయం మంత్రి తుమ్మల చెప్పిన సంగతి తెలిసిందే.

జనవరి 26న రైతుభరోసా,ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,కొత్త రేషన్ కార్డులు నాలుగు స్కీంలను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మండలంలో ఒక గ్రామం చొప్పును నాలుగు పథకాలు ప్రారంభించింది. కొంతమందికే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయి. మిగతా వారికి రోజు విడిచి రోజు గ్రామాల వారీగా డబ్బులు జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 40 రోజుల వరకు రైతు భరోసా డబ్బులు జమచేస్తామని చెప్పారు. 

చాలా మంది అప్పటి నుంచి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు.  ఇవాళ ఎకరంలోపు ఉన్న రైతులకు డబ్బులు జమ కావడంతో ఆనందిస్తున్నారు రైతులు.   సీఎం రేవంత్ సర్కార్ వ్యవసాయ యోగ్యమైన  ప్రతీ ఎకరానికి సంవత్సరానికి రూ. 12 వేలు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.