‘డబుల్’ ఇండ్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం : కలెక్టర్ ​క్రాంతి

‘డబుల్’ ఇండ్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం : కలెక్టర్ ​క్రాంతి

రామచంద్రాపురం, వెలుగు: పేదల కోసం నిర్మించిన డబుల్​ బెడ్​రూమ్​ఇండ్లలో​త్వరలోనే అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కలెక్టర్​క్రాంతి హామీఇచ్చారు. శుక్రవారం తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్​ డబుల్​ బెడ్రూమ్​ల వద్ద వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. కొల్లూర్​ డబుల్​బెడ్రూమ్​లు ప్రైమ్​లొకేషన్​లో ఉన్నాయని ఇక్కడ మరో 30 వేల జనాభా నివసించేందుకు అవకాశం ఉందన్నారు.

నగరాలకు తీసి పోకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ప్రైమరీ స్కూల్​, అంగన్వాడీ, డ్రైనేజీ, తాగునీరు, లిఫ్ట్​, టెలీ కమ్యూనికేషన్, రేషన్​షాపు, బస్ సౌకర్యం, పోలీస్​సెక్యూరిటీ తదితర వసతులను కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 7 వేల 258 కుంటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయని, మిగతా ఇండ్లను కూడా త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.

చదువుకునే చిన్నారుల సంఖ్యకు అనుగుణంగా స్కూల్​ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాల కోసం ఏఎన్​ఎంలను నియమించి, హెల్త్​ సెంటర్ ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్డీవో రవీందర్​రెడ్డి, డీఈవో వెంకటేశ్వర్లు, డిస్ర్టిక్​వెల్ఫేర్​ఆఫీసర్​ లలిత కుమారి, తహసీల్దార్​ సంగ్రామ్ రెడ్డి, జీహెచ్ఎంసీ, మున్సిపల్, హెచ్‌ఎండీఏ అధికారులు పాల్గొన్నారు.