
హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ల యూనిఫాం ఏడాదిపాటు మన్నికగా ఉండేలా కుట్టాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మహిళలకు సూచించారు. గురువారం రాంనగర్ మేడిబాయి బస్తీలోని యూనిఫాం కుట్టు కేంద్రాలను కలెక్టర్సందర్శించారు. యూనిఫాం కుడుతున్న మహిళలతో మాట్లాడారు. ‘ఎన్ని ఆర్డర్ ఇచ్చారు.. రోజుకు ఎన్ని జతలు కుడుతున్నారు, ఇప్పటివరకు ఎన్ని కుట్టారు, ఎప్పటిలోగా పూర్తవుతాయి’ అని అడిగి తెలుసుకున్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే స్కూల్యూనిఫాం కుట్టే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించిందని తెలిపారు. మంచిగా కుడితే వచ్చే విద్యా సంవత్సరం కూడా యూనిఫాం కుట్టే బాధ్యతను అప్పగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ యూసీడీ జాయింట్ కమిషనర్ వెంకట్ రెడ్డి, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్సుధాకర్ రావు, సిబ్బంది మధు, ఉస్మాన్, మంజుల తదితరులు పాల్గొన్నారు.
అలాగే 16న జరగనున్న యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్అనుదీప్తెలిపారు. గురువారం యూపీఎస్సీ అడిషనల్ సెక్రటరీ రాజ్ కుమార్ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు చేశారు. జిల్లాలో చేసిన ఏర్పాట్లను కలెక్టర్ అనుదీప్ వివరించారు. అడిషనల్కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్, డీఆర్ఓ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.