వేములవాడ రాజన్న గోశాల అధునీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ 

వేములవాడ రాజన్న గోశాల అధునీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ 

వేములవాడ రాజన్న ఆలయంలోని గోశాల అధునీకరణకు రాష్ట్ర దేవాదాయ శాఖ కోటి పదకొండ లక్షల రూపాయల నిధుల ప్రపోజల్ కు అనుమతిచ్చింది. దక్షిణ కాశీగా పిలవబడుతున్న వేములవాడ రాజన్న ఆలయంలో ఇటీవల  గోశాల, కోడెల పరిస్థితి దయనీయంగా ఉండటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 

దీంతో ఐదు రోజుల క్రితం గోశాలను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ సందర్శించారు.  వెంటనే గోశాల ఆధునీకరణకి ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించగా..  2 రోజుల్లోనే దేవాదాయ శాఖ  నుండి అనుమతి లభించింది. 

అనుమతి కోసం కృషి చేసిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కి, ఆలయ అధికారుల కృతజ్ఞతలు తెలిపారు.  కొత్త షెడ్స్ కోసం రూ.50 లక్షలు, గోశాలలో సీసీ రోడ్ల కోసం రూ.43 లక్షలు, డ్రైనేజీ కోసం రూ.18 లక్షల నిధులకు అనుమతి లభించింది.