హైదరాబాద్: తెలంగాణలో ఘనంగా జరుపుకునే పండుగల్లో సదర్ సమ్మేళన్ ఒకటి. దీపావళి తర్వాత రోజు యాదవ కమ్యూనిటీ చేసే ఈ సదర్ పండుగకు దాదాపు 70 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇకపై ఈ సదర్ పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగల్లో ఒకటిగా నిలవనుంది. ఈ మేరకు సదర్ పండుగకు రాష్ట్ర పండుగ హోదాను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
— Informed Alerts (@InformedAlerts) November 2, 2024
సికింద్రాబాద్, హైదరాబాద్ సిటీల్లో చాలా ఫేమస్ పండుగ ఇది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీపావళి తర్వా త సెకండ్ డే యాదవ కులస్తులు ఈ సదర్ పండగను ఘనంగా జరుపుతారు. ఇక్కడ ప్రతి ఏడాదీ సదరు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది.. సిటీలోని ముషీరాబాద్లో నిర్వహించే ‘పెద్ద సదర్’ మస్త్ ఫేమస్. యాదవులు తమ వద్ద గల దున్నపోతుల్లో బలమైన, అందమైన దున్నపోతులను ఈ పండుగలో ప్రదర్శిస్తారు.
Also Read : నా ఫీజు 100 కోట్ల రూపాయలపైనే
దున్నపోతులకు పూలదండలు, గజ్జలు, ముత్యాల మాలలు, పసుపు, కుంకుమలు, పట్టు పరదాలతో మంచిగా రెడీ చేసి, మెయిన్ సెంటర్లు, ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. యాదవులకు ప్రత్యేకమైన 'డవక్- దన్కీ-దన్' స్పెషల్బ్యాంక్తో దున్నపోతుల చుట్టూ స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకుంటారు.
దున్నపోతులతో కుస్తీ పడుతూ విన్యాసాలు, డ్యాన్సులు చేయిస్తారు. ఇది సదర్కు స్పెషల్ అట్రాక్షన్. తీన్మార్ స్టెప్పులు, దక్నక్ డ్యాన్స్లతో ఫుల్ జోష్... యూత్ మొత్తం ఉత్సహంగా సదర్ పండుగలో పాల్గొంటారు. సదర్ పండుగకు వచ్చిన వారు కులమతాలకు అతీతంగా ఒకరికొకరు అలాయ్ బలయ్ తీసుకుంటారు.