తెలంగాణకు ఆ ఐఏఎస్లతో సంబంధం లేదు

తెలంగాణకు ఆ  ఐఏఎస్లతో  సంబంధం లేదు

 కేంద్ర ఉత్తర్వుల ప్రకారం ఐఏఎస్,ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. నాలుగు రోజుల క్రితమే అందరినీ రిలీవ్ చేసినట్లు ఉత్వర్వులు కూడా జారీ చేసింది. డిఓపిటి ఆదేశాల అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వారితో తమకు ప్రభుత్వానికి ఏం సంబంధంలేదని కూడా స్పష్టం చేసింది. తాము ఏపీకి వెల్లేది లేదంటున్న అధికారుల్లో IAS అధికారులు వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, సృజనలు ఉన్నారు.

మరో వైపు ఏపీకి చెందిన IAS, IPS అధికారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు తెలంగాణ క్యాడరే కావాలని పిటిషన్ లో తెలిపినట్టు తెలుస్తోంది. తాము ఇక్కడే  సేవలు అందిస్తామని కేంద్ర ఆదేశాలు వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యూనల్ లో కూడా వారి వాదనలు వినించారు. కాని CAT అనుమతి ఇవ్వలేదు.