అన్ని హాస్టళ్లలో ఒకే మోనూ ..కామన్‌‌‌‌‌‌‌‌ డైట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

అన్ని హాస్టళ్లలో ఒకే మోనూ ..కామన్‌‌‌‌‌‌‌‌ డైట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: అన్ని హాస్టళ్లలో విద్యార్థులందరికీ కామన్‌‌‌‌‌‌‌‌ మెనూను అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. శనివారం ఉమ్మడి జిల్లాలోని పలు హాస్టళ్లలో కామన్‌‌‌‌‌‌‌‌ డైట్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రాం అమలును ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలకు వసతి సౌకర్యం, భవన నిర్మాణాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిందన్నారు. గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థులకు బలమైన ఆహారం అందించాలన్న ఉద్దేశంతో నిపుణుల సూచనలతో డైట్ మెనూ రూపొందించారన్నారు.

వేములవాడలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ స్కూల్(గర్ల్స్ మానాల)లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులతో కలిసి డ్యాన్సులు చేశారు.  కరీంనగర్ లోని మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో కామన్ మెనూ బ్రోచర్ ను స్పెషల్ ఆఫీసర్, అడిషనల్ డీఆర్డీఓ సునీత ఆవిష్కరించారు. జగిత్యాల సోషల్ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమెన్స్‌‌‌‌‌‌‌‌ డిగ్రీ కాలేజీలో ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి,  కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలోని బీసీ, ఎస్సీ బాలుర హస్టల్​లో మహిళా కమిషన్ స్టేట్​ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ నేరెళ్ల శారద  ప్రారంభించారు.