మహబూబ్ నగర్ జిల్లాలో లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు

మహబూబ్ నగర్ జిల్లాలో లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు
  • ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పండగల నాలుగు స్కీం మంజూరు పత్రాల అందజేత
  • పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు

వెలుగు, నెట్ వర్క్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో  నాలుగు సంక్షేమ పథకాల అమలును ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు.  వంగూరు మండలంలోని మిట్ట సదగోడు, గ్రామంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు సంక్షేమ పథకాల మంజూరు పత్రాలను అందజేశారు. నాగర్ కర్నూల్ మండలం పెద్దాపూర్ గ్రామంలో  ఇందిరమ్మ ఇళ్లు,  రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అందజేశారు. 

పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. కలెక్టర్ సంతోష్ తో కలిసి ధరూర్ మండల పరిధిలోని అల్లాపాడు, కేటి దొడ్డి మండలంలోని ఉమిత్యాల, గద్వాల మండలంలోని కురువపల్లె, గట్టు మండలంలోని ఆరగిద్ద, మల్దకల్ మండలంలోని నాగర్ దొడ్డి విలేజ్ లలో స్కీమ్​లను  ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ భరోసా, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే, కలెక్టర్ అందించారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాల అమలును మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పండుగ వాతావరణం లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండలం పసుపుల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ప్రారంభించారు.  

పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు.  ఉప్పునుంతల మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే రెండో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణం ఉప్పునుంతలలో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 

గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామంలో రైతు భరోసా లబ్ధిదారులకు ప్రోసీడింగ్ కాపీలను  జిల్లా కలెక్టర్ అదర్శ్ సురభితో పంపిణీ చేశారు. 

హన్వాడ మండలం ఇబ్రహీంబాద్  గ్రామంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయితో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా,  రేషన్ కార్డులు ,ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.