హైదరాబాద్: ఇంటి అనుమతులు సులభంగా ఇచ్చేందుకు వీలుగా బిల్డ్ నౌ అనే యాప్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఐఐటీ విద్యార్థులు రూపొందించిన ఈ యాప్ను ఇవాళ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఒక బిల్డింగ్లో, కమర్షియల్ కాంప్లెక్స్లో బ్లాక్లు,హాల్, కిచెన్, బెడ్ రూమ్ వీటిని 3డీలో చూసే అవకాశం ఉంటుంది. ఈ యాప్ కోసం అపార్ట్మెంట్ల దగ్గర కియాస్క్లను ఏర్పాటు చేయనున్నారు. దాని ఆధారంగా విస్తీర్ణం ఎంత ఉందనేది తెలుస్తుంది. వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకే ఈ యాప్ను డెవలప్ చేశామని మంత్రి చెప్పారు.
రెరా వెబ్సైట్తో ఈ సిస్టమ్ను లింక్ చేస్తామని చెప్పారు. ఈ యాప్పై ఆర్కిటెక్లు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు, ప్రభుత్వ అధికారులకు రాబోయే రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇస్తామని మంత్రి చెప్పారు. దీనిని ఫిబ్రవరి 1 నుంచి అందరికీ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో దాదాపు 60% జనాభా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నందున ఈ శాఖ ప్రాధాన్యతపై దృష్టి పెట్టి.. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పిస్తున్నామని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నామని చెప్పారు.
రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ టాప్
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని రిపోర్టులు చెబుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ ప్రజలే గృహ రుణాలు అధికంగా తీసుకుంటున్నారని వెల్లడించారు. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెరుగుతున్నాయని అన్నారు. 250 కోట్ల ఎక్కువ నెట్ వర్త్ ఉన్న వాళ్ళు హైదరాబాద్ 467 మంది ఉన్నారు ఇది బెంగళూరు కంటే ఎక్కువని చెప్పారు. ఇక్కడే ఎక్కువ మంది హోం లోన్స్ తీసుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్ లో 9.5 లక్షల మంది కి పైగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. 2024 లో ప్రపంచంలో లో టాప్ 5 సిటీ లో హైదరాబాద్ ఉందని రిపోర్ట్ ఇచ్చాయని వివరించారు.