హైదరాబాద్, వెలుగు: రోడ్లపై గుంతల వల్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు.. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా టీ రస్తా తరహాలో ఒక యాప్‌ను రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా యాప్‌ను రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ జి.రాధారాణితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఆదేశించింది.
రోడ్లపై గుంతలు, మ్యాన్‌హోళ్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో పౌరులు మృత్యువాత పడుతున్నారని అడ్వకేట్ కె.అఖిల్ శ్రీగురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు.