మానసిక రుగ్మతలతో వస్తున్న వారికి ట్రీట్మెంట్ అందిచేందుకు ఎంజీఎంలో 50 బెడ్లతో సైకియాట్రిక్ వార్డు అందుబాటులో ఉండేది. కానీ కొవిడ్సెకండ్వేవ్నుంచి ఆ వార్డులోని బెడ్లను కూడా కరోనా పేషెంట్లకే వినియోగిస్తున్నారు. దీంతో మెంటల్ పేషెంట్లకు ప్రత్యేకమైన వార్డు అంటూ ఏమీ లేకుండా పోయింది. ఫలితంగా బాధితులకు డాక్టర్లు మందులు రాసిచ్చి పంపడం తప్ప.. ఇన్ పేషెంట్‌గా చేర్చుకుని ట్రీట్మెంట్అందించలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరమైతే మాత్రం హైదరాబాద్ఎర్రగడ్డ ఆసుపత్రి లేదా ఇక్కడే ఏదైనా ప్రైవేటు హాస్పిటల్‌కు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన స్టాఫ్, ఎక్విప్మెంట్లేకున్నా పేషెంట్లను అడ్మిట్చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నారు. ఇదిలా ఉంటే బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఎలాంటి పర్మిషన్లు లేకున్నా ‘డి అడిక్షన్’ సెంటర్లు రన్ చేస్తూ బాధితులను దోచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికైనా వరంగల్ లో మెంటల్ హాస్పిటల్ ఏర్పాటుకు స్థానిక లీడర్లు చొరవ తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
హనుమకొండ, వెలుగు: వరంగల్‌కు కేంద్రం మంజూరు చేసిన ‘మెంటల్ హెల్త్ ఇనిస్టిట్యూట్’ను రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. ఉత్తర తెలంగాణ వైద్య అవసరాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎంకు మానసిక రోగుల సంఖ్య కొన్నేండ్లుగా పెరుగుతోంది. దీంతో కాకతీయ మెడికల్ కాలేజ్డాక్టర్ల ప్రపోజల్స్మేరకు నాలుగేండ్ల కింద కేంద్ర ప్రభుత్వం వరంగల్ కు ‘మెంటల్హెల్త్ఇనిస్టిట్యూట్’ శాంక్షన్చేసింది. బిల్డింగ్నిర్మాణానికి రూ.33 కోట్లు అవసరం కాగా, అదే ఏడాది మొదటి విడత రూ.17 కోట్లు రిలీజ్ చేసింది. వాటిని ఖర్చు చేస్తే మిగతా ఫండ్స్రిలీజ్చేసేందుకు రెడీగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో కేంద్రం ఇచ్చిన ఫండ్స్ కాస్త స్టేట్ట్రెజరీలోనే మూలుగుతున్నాయి. ఫలితంగా ఉత్తర తెలంగాణకు చెందిన మానసిక రోగులను ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తీసుకెళ్లడం పేద రోగులకు ఇబ్బందిగా మారింది.
పెరుగుతున్న బాధితులు
రాష్ట్రంలో ఆల్కహాల్ తో పాటు గంజాయి, కొకైన్ లాంటి డ్రగ్స్వినియోగం పెరిగిపోతోంది. ఏజ్ తో సంబంధం లేకుండా ఎంతోమంది మత్తుపదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాగిన మత్తులో వివిధ అకృత్యాలకు పాల్పడడంతోపాటు సూసైడ్చేసుకుంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. వీరేగాక వివిధ కారణాలతో మానసిక రోగులుగా మారుతున్నవారు తెలంగాణవ్యాప్తంగా వేలల్లో ఉన్నారు. ఇలాంటి బాధితులకు ట్రీట్మెంట్అందించేందుకు హైదరాబాద్‌లో మెంటల్హాస్పిటల్ఉన్నప్పటికీ పెరుగుతున్న మానసిక రోగుల అవసరాలకు సరిపోవడం లేదు. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మెంటల్హెల్త్కు సంబంధించి సరైన హాస్పిటల్స్లేకపోవడంతో పేషెంట్స్‌ను వరంగల్ ఎంజీఎంకే తీసుకువస్తున్నారు. ఈ విభాగానికి సంబంధించి ఎంజీఎంలో ప్రతిరోజూ సగటున 80 నుంచి 100 ఓపీ నమోదు అవుతోంది. అందులో కనీసం 10 మందికి ఐపీ సేవలు అవసరం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ పేషెంట్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోందని, అందులో గంజాయి వల్ల సఫర్ అవుతున్నవారే ఎక్కువగా ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
100 బెడ్ల హాస్పిటల్ మంజూరు
చాలామంది ఆల్కహాల్, గంజాయికి బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారని, మెంటల్ హెల్త్ఇన్ స్టిట్యూట్ఏర్పాటు అవసరాన్ని ప్రస్తావిస్తూ 2017 అక్టోబర్‌లో అప్పటి కేఎంసీ ప్రిన్సిపల్, ప్రస్తుత ఎంజీఎం సూపరింటెండెంట్ డా.వి.చంద్రశేఖర్ కేంద్రానికి ప్రపోజల్స్పంపించారు. అప్పటికే కేఎంసీ ఆవరణలో కన్స్ట్రక్ట్అవుతున్న పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న స్థలాన్ని ప్రతిపాదించారు. అదే నెల కేంద్రం నుంచి పిలుపురావడంతో ఇక్కడి ఆఫీసర్లు వెళ్లి హాస్పిటల్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. దీంతో 2018 జనవరి ఫస్ట్‌వీక్ లో కేంద్ర కుటుంబ ఆరోగ్య, సంక్షేమశాఖ ఆఫీసర్లు సిటీకి వచ్చారు. కేఎంసీ ఆవరణలో ఆఫీసర్లు ప్రతిపాదించిన స్థలాన్ని చూసి మెంటల్హెల్త్ ఇన్స్టిట్యూట్కు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం హాస్పిటల్నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్రం పైసా పెట్టలే
మెంటల్హెల్త్ఇన్ స్టిట్యూట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాల్సి ఉంది. హాస్పిటల్నిర్మాణానికి మొత్తం రూ.33 కోట్లు అవసరం కాగా.. అందులో 70 శాతం కేంద్రం, మిగతా 30 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంది. అంటే మొత్తం బడ్జెట్లో రూ.23 కోట్లు కేంద్రం వాటా కాగా, మిగతా రూ.10 కోట్లు రాష్ట్రం చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు 2018 ఫిబ్రవరిలోనే సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం కోసం మొదటి విడత రూ.17 కోట్లు రిలీజ్ చేసింది. వాటిని వినియోగించిన తరువాత మిగతా ఫండ్స్ రిలీజ్చేస్తామని అప్పట్లో చెప్పినప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అడుగు ముందుకు వేయలేదు. దీంతో మెంటల్హాస్పిటల్ కాగితాల్లోనే ఆగిపోయింది. ఈ హాస్పిటల్ఏర్పాటైతే పిడియాట్రిక్, అడల్ట్, ఎమర్జెన్సీ, ఫొరెన్సిక్ సైకియాట్రి, ఇలా వివిధ రకాల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.