
ఎల్బీనగర్, వెలుగు: మూడు నెలలుగా జీతాలు అందట్లేదని జీహెచ్ఎంసీ ఎల్బీనగర్జోన్స్ట్రీట్ లైట్ ఎలక్ట్రీషియన్స్ అండ్ హెల్పర్స్శనివారం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. హయత్ నగర్, సరూర్ నగర్, ఎల్బీనగర్ సర్కిళ్ల పరిధిలో 30 మంది సిబ్బంది పనిచేస్తున్నామని తెలిపారు. మూడు నెలలుగా కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. ఎప్పటికప్పుడు మాటదాట వేస్తున్నాడని మండిపడ్డారు. అధికారులు స్పందించి, తమకు న్యాయం చేయాలని కోరారు.