సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2024 మే13వ తేదీ సోమవారం రోజున కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ సిబ్బంది, ఉద్యోగులకు మంగళవారం ఆన్ డ్యూటీగా పరిగణించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తోన్న ప్రతి ఒక్క కార్మికుడు ఓటు హక్కు వినియోగించుకోవాలనే నేపథ్యంలో పోలింగ్ డే (మే 13) రోజున కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది.
మరోవైపు హైదరాబాద్ లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్ కానున్నాయి ఈ విషయాన్ని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు క్లోజ్ అయ్యాయి. పోలింగ్ జరిగే మే 13వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.
పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి ఓపెన్ అవుతాయి. అయితే హైదరాబాద్ లో మాత్రం మరో 12 గంటలు లిక్కర్ షాపులు, బార్లు, హోటల్స్, క్లబ్స్,అన్ని రకాల లిక్కర్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి మే 14 తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ అవుతాయి.