
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఎల్ఆర్ఎస్ గడువు పెంచింది. ఏప్రిల్ 30 వరకు ఎల్ఆర్ఎస్ గడువు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 వరకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడంతో మరోసారి ఎల్ఆర్ఎస్ గడువును పెంచింది ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ ఫీజు 25 శాతం డిస్కౌంట్ తో చెల్లించేందుకు ఏప్రిల్ 30 వరకు గడవు ఇచ్చింది.
25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి, స్థలాలను రెగ్యులరైజేషన్చేసుకునేందుకు చేపట్టిన స్పెషల్‌డ్రైవ్ కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. రుసుము చెల్లించాలనుకుంటున్న వారికి టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయి. అప్లికేషన్ చేసినప్పటి వివరాలకు ఆన్లైన్లో జనరేట్అయిన వివరాలకు పొంతన ఉండటం లేదు. సరిచేసుకుందామంటే సర్వర్ బిజీ అని వస్తోంది. ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లు యాక్టివ్‌గా లేకపోవడం కూడా శాపంగా మారింది. 2020కి ముందు అప్లికేషన్ పెట్టుకున్న వారి వివరాలేవీ ఆన్లైన్ లో కనిపించకపోవడంతో గందరగోళం నెలకొంది.
ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమంది తమ ప్లాట్లను వేరే వారికి అమ్మేశారు. ఆ వివరాలు ఇప్పుడు మున్సిపాలిటీలో లేవు. రెగ్యులైజేషన్కోసం రమ్మని దరఖాస్తుదారులకు ఫోన్‌చేస్తే వారు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో ప్లాట్ల రెగ్యులైజేషన్ మరీ నెమ్మదిగా ఉంది. ఈ క్రమంలోనే ఎల్ఆర్ఎస్ గడువు పెంచినట్లు తెలుస్తోంది.