- 10 రోజుల్లో టెండర్లు
- రైజింగ్ హైదరాబాద్’ స్కీమ్ కింద రూ.1,090 కోట్ల ఫండ్స్
- ఏడాదిన్నరలో పూర్తి చేసేలా కసరత్తు.. ఉన్నతాధికారుల వరుస సమీక్షలు
- బంజారాహిల్స్‌రోడ్ నెంబర్–12ను120 అడుగల మేర విస్తరణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేబీఆర్పార్క్చుట్టూ ట్రాఫిక్సమస్యకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ‘రైజింగ్ హైదరాబాద్’ స్కీమ్ లో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టాలని భావిస్తోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్(హెచ్–సిటీ) పేరుతో సిటీలో 38 పనులను 7 ప్యాకేజీల్లో చేయాలని జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. ఇందులో మొదటి ప్యాకేజీ కింద కేబీఆర్ పార్కు చుట్టూ 6 అండర్ పాస్ లు, 8 స్టీల్ బ్రిడ్జిలు(ఫ్లై ఓవర్లు) నిర్మించనున్నారు.
మొదట రూ.826 కోట్లతో వీటిని నిర్మించాలని అనుకున్నప్పటికీ ఫ్లైఓవర్లు మొత్తం స్టీల్ తో నిర్మించాలని నిర్ణయించడంతో అంచనా వ్యయం రూ.1,090 కోట్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం రైజింగ్ హైదరాబాద్ స్కీమ్ కింద విడుదల చేయనుంది. ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులు పనుల ప్రక్రియను స్పీడప్ చేశారు. 10 రోజుల్లో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. పూర్తయిన వెంటనే పనులు స్టార్ట్ చేయనున్నారు.
6 జంక్షన్లలో 6 అండర్ పాస్‌లు
కేబీఆర్పార్క్చుట్టూ మొత్తం ఆరు జంక్షన్లలో ఆరు అండర్ పాస్ లు రానున్నాయి. అలాగే ఒక పక్క నుంచి మరో పక్కకు ట్రాఫిక్ సమస్య లేకుండా 8 చోట్ల స్టీల్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని బల్దియా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. 2026 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశముంది.
ప్రస్తుతం ఉన్న పాలకమండలి గడువు అదే నెల 10న ముగియనుంది. ఈ లోపు పార్కు చుట్టూ కొన్నిచోట్ల అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రేటర్లో ఒకేచోట భారీగా పనులు మొదలు పెట్టడం ఇదే మొదటిది. కేబీఆర్పార్క్చుట్టూ జూబ్లీ చెక్ పోస్టు, రోడ్ నెంబర్45, ఫిలింనగర్, మహారాజ్అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్ఎంట్రన్స్ జంక్షన్లు ఉన్నాయి. ఇందులో జూబ్లీ చెక్పోస్ట్జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ల వద్ద రెండు చొప్పున స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయి. మిగిలిన నాలుగు జంక్షన్లలో ఒక్కో స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు.
జూబ్లీ చెక్‌పోస్ట్‌వద్ద ఒకదానిపై మరో ఫ్లైఓవర్ రానున్నాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్డు నెంబర్ 45 వైపు వచ్చే ఫ్లైఓవర్ పై భాగంలో 2 లేన్లలో ఉంటుంది. కేబీఆర్ పార్కు నుంచి రోడ్ 36 వైపు వెళ్లే 4 లేన్ల ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లనుంది. వీటికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో కేబీఆర్ పార్కు గ్రీనరీపై ప్రభావం పడుతుందని పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ని ఆశ్రయించారు. ఎటువంటి ప్రభావం పడకుండా పనులు చేస్తామని, ఒకవేళ చెట్లు తొలగించాల్సి వస్తే వాటిని వేరేచోట ట్రాన్స్ ప్లాంట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
రోడ్లన్నీ మరో 20 అడుగుల వెడల్పు
అభివృద్ధి పనుల్లో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్ల విస్తరణ జరగనుంది. టీడీపీ ఆఫీసు పక్కన మినహా చుట్టూ ఉన్న రోడ్లను విస్తరించనున్నారు. ప్రస్తుతం 100 అడుగుల మేర ఉన్న రోడ్లను 120 అడుగులకు పెంచనున్నారు. కిందిభాగంలో అండర్ పాస్ లు, పైన స్టీల్ బ్రిడ్జిలతో పాటు 120 ఫీట్ల రోడ్డు వస్తుండటంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఎక్కడా ట్రాఫిక్ సమస్యకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.
రోడ్ల వైడెనింగ్ కోసం 87 ఆస్తులను సేకరిస్తున్నారు. ఇందులో మాజీమంత్రి జానారెడ్డితోపాటు సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాలో ఓ దఫా మార్కింగ్ జరిగింది. టెండర్లు పూర్తికాగానే పనులు షురూ అవుతాయి. కేబీఆర్ పార్కుతో పాటు రోడ్ నంబర్12ను విస్తరించనున్నారు. 100 అడుగుల మేర ఉన్న రోడ్డును 120 అడుగులకు పెంచనున్నారు. బాలాజీ టెంపుల్ జంక్షన్ తోపాటు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.150 కోట్లను కేటాయించింది. ఈ పనులను కూడా వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు
కసరత్తు చేస్తున్నారు.