- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ లక్ష్మీనారాయణ చొరవ
- లింగాపూర్ లో స్థల స్వాధీనానికి జిల్లా కలెక్టర్కు లేఖ
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ దళిత వర్గాలకు ఉపాధి కల్పించేందుకు లెదర్ ఇండస్ట్రీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ కొంకటి లక్ష్మీనారాయణ రాసిన లేఖకు స్టేట్ లెదర్ఇండస్ట్రీ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్శ్రీనివాస్ నాయక్స్పందించారు.
దీంతో అంతర్గాం మండలం లింగాపూర్ లో సర్వే నంబర్ 132 లో 24 .32 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని లెదర్ ఇండస్ట్రీ ఏర్పాటుకు సహకరించాలని ఈనెల 9న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. అంతేకాకుండా జిల్లాలో 150 ఎకరాల్లో మెగా లెదర్ ఇండస్ట్రీని ఏర్పాటుకు కూడా స్థల సేకరణ కోసం సన్నాహాలు చేయాలని లెదర్ ఇండస్ట్రీ ఎండీ ఆ లేఖలో పేర్కొన్నారు.
అర్ధంతరంగా నిలిచిపోయిన లింగాపూర్ లో లెదర్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి దళిత యువతకు ఉపాధి కల్పించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చొరవ చూపడంపై దళిత సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.