మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తివేత : దిగువకు నీళ్లు విడుదల

మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తివేత : దిగువకు నీళ్లు విడుదల

కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజ్ కు నీళ్లు వస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పడిన వర్షాలతో.. మేడిగడ్డకు వరద వస్తుంది. దీంతో బ్యారేజీలోని 85 గేట్లను తెరిచి.. దిగువకు నీళ్లు వదులుతున్నారు అధికారులు. 2024, జూలై 10వ తేదీ మధ్యాహ్నం నుంచి బ్యారేజ్ దిగువకు నీళ్లు వదులుతున్నారు.

మేడిగడ్డ బ్యారేజీకి ఇన్ ఫ్లో 41 వేల 500 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో కూడా 41 వేల 500 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీలోకి వచ్చిన నీటిని.. వచ్చినట్లు విడుదల చేస్తున్నారు అధికారులు. 

ALSO READ | స్వల్పంగా పెరుగుతున్న గోదావరి