ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి 3వేల కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న అప్లికేషన్ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 95వేల 2వందల35 ఇండ్లను మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాలకు 38వేల 94ఇండ్లు కేటాయించగా.. అర్భన్ 57వేల 141 ఇండ్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్.
మార్చి 11న పథకం ప్రారంభం
స్కీంను ఈ నెల 11న భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడ్లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేయనున్నారు. గైడ్ లైన్స్ ను హౌసింగ్ అధికారులు ప్రభుత్వానికి అందజేయగా సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైనల్ చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. తొలి దశలో ప్రధానంగా బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్లను, సొంత జాగాలు ఉన్న వాళ్లను అర్హులుగా గుర్తించనున్నారు.
ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్ల స్కీంకు మొత్తం 82 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం స్కీమ్ తీసుకున్న వాళ్లు 18 లక్షల మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు