యాదాద్రి భువనగిరి జిల్లా : యాదగిరిగుట్ట మండలం కందుకూరు గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ భీమగాని రాములు గత సంవత్సరం (2022 జూన్ 17) తేదీన వినూత్న నిరసన తెలిపారు. గ్రామంలో అర్ధనగ్నంగా ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తున్న కార్యక్రమాన్ని V6 ద్వారా ప్రజలోకి తీసుకెళ్లడంతో స్పందించిన ప్రజా ప్రతినిధులు, నాయకులు తక్షణమే పెద్దకందుకూరు గ్రామ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో హర్శం వ్యక్తం చేస్తూ V6 యాజమాన్యానికి సర్పంచ్ భీమగాని రాములు మరియు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
గత సంవత్సరం యాదగిరిపల్లి రోడ్డు నుంచి పెద్ద కందుకూర్ గ్రామం వరకు గల రోడ్డును మరమ్మత్తులు చేయడానికి నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో పెద్ద కందుకూర్ సర్పంచ్ భీమగాని రాములు ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తూ, గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు విడుల చేయాలంటూ నిరసన తెలిపారు. కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నాడు సర్పంచ్ భీమగాని రాములు .
ALSO READ : Cricket World Cup 2023: కింగ్ కొట్టేసాడు: సచిన్ ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ
దీంతో చేసేదేమీ లేక డప్పు చప్పుళ్లతో ఊళ్లోని షాపుల దగ్గర ,రోడ్డుపై బైక్ పై వెళ్తున్న వ్యక్తుల దగ్గర ఆర్టీసి బస్సులో తిరుగుతూ భిక్షాటన చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.