మరో 26 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు: మంజూరు చేసిన సర్కార్

మరో 26 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు: మంజూరు చేసిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా  26 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి  బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

బోధన్, పెద్దపల్లి, డోర్నకల్, సత్తుపల్లి, వైరా, కోదాడ, కొత్తగూడెం, నకిరేకల్, నాగార్జున సాగర్, తాండూరు, మక్తల్, రామగుండం, నారాయణ్ పేట, జుక్కల్, చొప్పదండి, కల్వకుర్తి, నిజామాబాద్ రూరల్, వనపర్తి, చేవేళ్ల, జగిత్యాల, వికారాబాద్, గద్వాల, ధర్మపురి, మెదక్, మేడ్చల్, ఆర్మూరు నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు అయ్యాయి.

కాగా..అక్టోబర్‌ 11న రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.అదే రోజు మొదటి విడతలో మంజూరైన 28 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు శంకుస్థాపన చేశారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించగా.. ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.26 కోట్లు ఖర్చు చేయనున్నారు.