కానిస్టేబుల్స్ కు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. 1989, 1990 బ్యాచ్ లో ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్స్ కు ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. హైదరాబాద్ రీజియన్లోని 187 ASI లకు SI లు గా ప్రమోషన్ కల్పించింది. ఈ మేరకు DGP జితేందర్ రెడ్డి ఆదేశాలతో మల్టీ జోన్ -2 IG వి.సత్యనారాయణ ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు . ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ పూర్తి చేసిన రోజునే ప్రమోషన్స్ ఇవ్వడంతో సిబ్బందిలో ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్చొతలు తెలిపారు.
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పోలీస్ డిపార్ట్ మెంట్ ను పెద్దగా పట్టించుకోలేదు. కానిస్టేబుళ్ల ప్రమోషన్స్ ను నిర్లక్ష్యం చేసింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ ప్రమోషన్లు ఆపేసింది. ఇతర డిపార్టమెంట్లలో తమతో పాటు జాయిన్వారు పెద్ద పొజిషన్లో ఉండగా.. తాము మాత్రం ఎక్కడికక్కడే మిగిలిపోవాల్సివచ్చిందని కానిస్టేబుల్స్ బాధ పడేవారు.ఈ క్రమంలో 187 మందికి ప్రమోషన్ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.