హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటన పై ప్రభుత్వం సీరియస్ అయింది. రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్, డీజీపీ కి ఆదేశాలు ఇచ్చింది. దాడి ఘటన పై సీఎస్ శాంతికుమారి ఆరా తీశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఘటన పై రిపోర్ట్ పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
లగచర్లలో ఘటన
ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్, అధికారులపై రైతులు, గ్రామస్తులు దాడి చేశారు. వారి కార్లపై రాళ్లు, కట్టెలతో అటాక్ చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆఫీసర్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. కార్ల అద్దాలు పగిలిపోయాయి. కొడంగల్ఏరియా డెవలప్మెంట్అథారిటీ (కడా) స్పెషల్ఆఫీసర్ వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరుగుతున్నప్పుడు అధికారులకు భద్రతగా ఒక్క పోలీసు కూడా లేరు. దీంతో కలెక్టర్‌ను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, డ్రైవర్ రక్షించారు.