మూసీ నిర్వాసితుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

మూసీ నిర్వాసితుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సెర్ఫ్ సీఈవో ఛైర్మన్‎గా 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ప్రభుత్వం  2024, అక్టోబర్ 5న ఉత్తర్వులు జారీ చేసింది.

ALSO READ | కాకా స్ఫూర్తితో మూసీ నిర్వాసితులను ఆదుకుందాం.. రూ.10 వేల కోట్లు ఇవ్వలేమా : -సీఎం రేవంత్ రెడ్డి

 మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని అక్కడ నుండి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, మూసీ పరివాహక బాధితుల నుండి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులకు ఇండ్లతో పాటు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. 14 మంది సభ్యులతో  ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కమిటీ మూసీ బాధితులకు ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చదానిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.