
హైదరాబాద్, వెలుగు: ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌తో పాటు ఇతర కమిషనర్లను ప్రభుత్వం త్వరలోనే నియమించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన సెర్చ్ కమిటీ.. ప్రభుత్వానికి కొన్ని పేర్లను సూచించినట్టు తెలిసింది. ఈ నెలలోనే రిటైర్ అవుతున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా నియమించనున్నట్టు చర్చ జరుగుతోంది.
ఈ విషయంపై ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. అందులో భాగంగా ముందే వీఆర్ఎస్ కూడా తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన వీఆర్ఎస్ తీసుకోకుంటే ఈ నెలఖారుకు పదవీ విరమణ చేశాక ఆర్టీఐ కమిషనర్ల నియమాకాలను పూర్తి చేస్తారని అంటున్నారు. సీఎం, ప్రతిపక్ష నేత, ఒక కేబినెట్ మంత్రి ఉన్న కమిటీ ఆయా పేర్లకు ఆమోదం తెలుపనుంది. ఆ తరువాత గవర్నర్వాటికి ఆమోద ముద్ర వేస్తూ ఉత్తర్వులు ఇస్తారు.