ఎంఎస్​ఎంఈ పాలసీని విడుదల చేస్తాం : డి.శ్రీధర్ బాబు

ఎంఎస్​ఎంఈ పాలసీని విడుదల చేస్తాం :  డి.శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: మొదటి ఎంఎస్​ఎంఈ పాలసీని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి  శ్రీధర్ బాబు ప్రకటించారు. దీని ముసాయిదా తయారవుతోందని, పరిశ్రమ పెద్దలు సూచనలను అందించాలని కోరారు. ఈ విధానం ఎంఎస్​ఎంఈ రంగం  సమ్మిళిత వృద్ధిపై దృష్టి పెడుతుందని, ఎంఎస్​ఎంఈలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని చెప్పారు.

ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్​ఓ) ఎంఎస్​ఎంఈల సమ్మిళిత వృద్ధిపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు.   హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను ఏఐకి భవిష్యత్​ రాజధానిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.