కామారెడ్డి జిల్లా మీదుగా మరో హైవే! ​

కామారెడ్డి జిల్లా మీదుగా మరో హైవే! ​
  •  కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం 
  •  కరీంనగర్ - కామారెడ్డి - ఎల్లారెడ్డి ( కేకేవై)  స్టేట్​హైవేను నేషనల్​హైవేగా మార్చాలని వినతి
  •  మహారాష్ట్ర, కర్నాటక వాసులకూ రవాణా సదుపాయం

కామారెడ్డి జిల్లా మీదుగా మరో హైవే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.  కరీంనగర్​ - కామారెడ్డి - ఎల్లారెడ్డి ( కేకేవై) స్టేట్​హైవేను నేషనల్​హైవేగా మార్చాలని  రాష్ర్ట ప్రభుత్వం  కేంద్రానికి ప్రపోజల్ పంపనుంది. ఈ హైవే నిర్మాణంతో కామారెడ్డి, సిరిసిల్లా, కరీంనగర్​ జిల్లాలతో పాటు మహారాష్ర్ట, కర్నాటక రాష్ట్రాలకు రవాణా మెరుగుపడనుంది. ఇప్పటికే  కామారెడ్డి జిల్లా మీదుగా  2 హైవేలు వెళ్తుండగా మరో హైవే నిర్మాణానికి ప్రపోజల్​ పంపనున్నారు.   కేకేవై రోడ్డును హైవేగా మార్చడం ద్వారా కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ మరింత మెరుగుకావటంతో  పాటు మహారాష్ర్టలోని పలు ఏరియాలకు అనుసంధానం కానుంది.

కామారెడ్డి, వెలుగు:  కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి స్టేట్ హైవే​ను కలుపుతూ పలు ఏరియాలకు రవాణా సదుపాయం ఉంది. నిత్యం ఈ  రోడ్డు బస్సులు, కార్లు, ఆటోలు, బైక్​లు, లారీలు, ఇతర గూడ్స్​ వెహికల్స్​రాకపోకలతో రద్దీగా ఉంటుంది.  కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ ​జిల్లాల్లోని పలు ఏరియాల నుంచి ఈ మార్గం గుండా  సిరిసిల్లా, కరీంనగర్​తో పాటు మహారాష్ర్ట, కర్నాటక వాసులు వేములవాడ రాజరాజేశ్వర స్వామి , కొండగట్టు అంజన్న దర్శనానికి వస్తుంటారు.  2 లేన్లతో ఉన్న ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలతో నిత్యం  రద్దీగా ఉంటుంది.

  జంక్షన్లు లేకపోవడంతోపాటు రోడ్డు ఇరుకు ఉండటం,  మూల మలుపులు, గుంతలు పడి ఉండడంతో  ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.  కేకేవై రోడ్డును నేషనల్​ హైవేగా మార్చి అభివృద్ధి చేస్తే రవాణా మెరుగవడం, రాకపోకలకు సమయం తగ్గడంతోపాటు ప్రమాదాలు కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.   కేకేవై రోడ్డును హైవేగా మర్చాలని  కొద్ది రోజుల క్రితం ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్​మోహన్​రావు విజ్ఞప్తి చేశారు.

ALSO READ : రేషన్​ బియ్యం దందాలో 11 మంది పోలీసులు

  పలు స్టేట్​హైవేలను నేషనల్ హైవేలుగా మార్చి అభివృద్ధి చేయాలని కేంద్రానికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం​ ప్రపోజల్స్ సిద్ధం చేసింది. ఇందులో కేకేవై రోడ్డు కూడా ఉంది. కరీంనగర్​ నుంచి సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి మీదుగా పిట్లం ( ఎన్​హెచ్–161  నర్సింగ్​రావు పల్లి చౌరస్తా  వరకు) 165 కి.మీ. హైవేగా మార్చనున్నారు.  

మూడు హైవేలను కలుపుతూ...

జిల్లాలో ఉన్న మూడు హైవేలను కలుపుతూ కేకేవై రోడ్డు నిర్మాణం జరగనుంది.  కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఎన్​హెచ్ 44, సంగారెడ్డి నుంచి  నాందేడ్​– అకోల వరకు ఉన్న ఎన్​హెచ్ 161,   హైదరాబాద్, నర్సాపూర్, మెదక్, ఎల్లారెడ్డి, బాన్సువాడల మీదుగా  నిర్మిస్తున్న  హైవేను అనుసంధానం చేయనుంది.  హైదరాబాద్​ నుంచి నర్సాపూర్, మెదక్ వరకు హైవే నిర్మాణం పూర్తికాగా,  ఇక్కడి నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ, వర్ని వరకు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

 మహారాష్ర్టలోని నాందేడ్, అకోల, కర్నాటకలోని బీదర్​ ఏరియాల నుంచి వచ్చే వాహనాలు కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్​ జిల్లాల వెళ్లడం సులభతరం కానుంది.   మెరుగైన రవాణా వసతులు ఉంటే ఇండస్ర్టీస్​ ఏర్పాటుతో పాటు,  ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.  వ్యవసాయ ఉత్పత్తులను ఆయా జిల్లాలకు తీసుకెళ్లి ఎక్కువ ధరలకు అమ్ముకోవటానికి వీలుంటుంది.  స్టేట్​నుంచి కేంద్రానికి ప్రపోజల్స్​వెళ్లిన తర్వాత త్వరగా మంజూరు కావటానికి ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిన 
అవసరముంది.