కమర్షియల్ ట్యాక్స్​ డైరెక్టర్​గా హరిత

కమర్షియల్ ట్యాక్స్​ డైరెక్టర్​గా హరిత
  • టీఎస్​ ఫుడ్స్ కు​ చంద్రశేఖర్​రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓగా కర్ణన్​కు అదనపు బాధ్యతలు
  • రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్​ల బదిలీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌‌‌‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్​ శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్​జాయింట్​ సెక్రటరీగా ఉన్న కె. హరితను వాణిజ్య పన్నుల శాఖ  డైరెక్టర్‌‌‌‌గా నియమించారు. హెల్త్​ అండ్​ ఫ్యామిలీ వెల్ఫేర్​ డైరెక్టర్​గా ఉన్న ఆర్వీ కర్ణన్‌‌‌‌కు ఆరోగ్యశ్రీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

తెలంగాణ ఫుడ్స్‌‌‌‌ ఎండీగా కె.చంద్రశేఖర్‌‌‌‌రెడ్డికి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌‌‌‌గా యాస్మిన్‌‌‌‌ బాషాకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. సహకార కమిషనర్‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌గా కె.సురేంద్రమోహన్‌‌‌‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఎల్‌‌‌‌.శివకుమార్‌‌‌‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వనపర్తి అదనపు కలెక్టర్‌‌‌‌ సంచిత్‌‌‌‌ గంగ్వార్‌‌‌‌ ను నారాయణపేట అదనపు కలెక్టర్‌‌‌‌గా బదిలీ చేసింది. టెక్స్‌‌‌‌టైల్స్‌‌‌‌, హ్యాండ్లూమ్స్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ బి.శ్రీనివాస్‌‌‌‌రెడ్డి మాతృ సంస్థకు ట్రాన్స్​ఫర్​ అయ్యారు.