కొత్త అధికారులు వచ్చారు..

కొత్త అధికారులు వచ్చారు..

నెట్​వర్క్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టర్​గా సి.నారాయణ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న శశాంకకు స్టేట్​ఫ్లాగ్​షిప్​ ప్రాజెక్ట్స్​  కమిషనర్​గా బదిలీ అయ్యారు. మరోవైపు, కందుకూరు డివిజన్ ఆర్డీవోగా ఉన్న సూరజ్‌‌‌‌‌‌‌‌కుమార్​ ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఎన్​. జగదీశ్వర్​రెడ్డిని ప్రభుత్వం నియమించింది.

చేవెళ్ల ఆర్డీవో (డిప్యూటీ కలెక్టర్​)గా కె.చంద్రకళను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ పనిచేస్తున్న సాయిరాంను సికింద్రాబాద్​ ఆర్డీవోగా బదిలీ చేసింది. నిజాంపేట్​కమిషనర్​గా సాబేర్​ అలీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్టీవోలు కె. మహిపాల్, ఆర్.దశరథ్ సింగ్ లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్  ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్​నగర్ భీమా ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ గా పని చేస్తున్న జి.ముకుందరెడ్డిని హైదరాబాద్ అడిషనల్​ కలెక్టర్( రెవెన్యూ)గా నియమించారు.