తెలంగాణలో పలువురు ఎస్‌పీలు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో ఏడుగురు నాన్ క్యాడర్ ఎస్‌పీలు, ఒక అదనపు ఎస్‌పీని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్ నగర విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీగా ఉన్న ధార కవితను సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. ఇక, ఇంటెలిజెన్స్ ఎస్‌పీగా ఉన్న సునీతా మోహన్‌ను రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు.
బదిలీ అయిన ఎస్‌పీలు
- ధార కవిత: హైదరాబాద్ సైబర్‌క్రైమ్ డీసీపీ
- ఎ రమణా రెడ్డి: మల్కాజిగిరి-భువనగిరి ఎస్‌ఓటీ డీసీపీ
- ఎం వ్నేకటేశ్వర్లు: ఆక్టోపస్ ఎస్పీ అడ్మిన్
- డి శ్రీనివాస్: మాదాపూర్ ఎస్‌ఓటీ
- బి శ్రీదలా దేవి: సైబరాబాద్ క్రైమ్ డీసీపీ
- జి సునీతా మోహన్: తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్
- వై సాయిశేఖర్: ఇంటెలిజెన్స్ ఎస్పీ
- ఎస్ వినోద్ కుమార్: ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ