గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి

గ్రామపంచాయతీ  కార్మికులకు వేతనాలు పెంచాలి

ముషీరాబాద్,వెలుగు: గ్రామపంచాయతీ ఉద్యో గ, కార్మికులకు వేతనాలు పెంచాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నా  నిర్వహించారు.  సీఐటీయూ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ నాయకులు నరసింహ, సూర్యం, అరుణ్ కుమార్, వెంకటయ్య మాట్లాడారు.  కార్మికుల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్​ చేశారు.  సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 18,  19 న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, డిసెంబర్ 27, 28న రెండు రోజుల టోకెన్ సమ్మె చేయాలని జేఏసీ నిర్ణయించిందన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి జేఏసీ సమావేశంలో నిరవధిక సమ్మె తేదీలను ఖరారు చేస్తామని తెలిపారు.