హైదరాబాద్: బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్‌కు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు నంద కిశోర్ గోకుల్ యాదవ్, అలెగ్జాండర్ ఫ్రాన్సీస్, పౌర సంబంధాల అధికారి కాలేరు సురేశ్ ఇందులో పాల్గొన్నారు.