తెలంగాణ గ్రూప్‌ -2 పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్‌ -2 పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్‌ -2 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. గతేడాది డిసెంబరులో జరిగిన రాతపరీక్షల మార్కులను టీజీపీఎస్‌సీ (TGPSC) వెల్లడించింది. అభ్యర్థులకు మార్కులతో కూడిన జనరల్‌ ర్యాంకు జాబితాను ప్రకటించనుంది. అభ్యర్థులు తమ ఫలితాలను https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.తుది కీ, మాస్టర్‌ క్వశ్చన్‌పేపర్లతో పాటు ఓఎంఆర్‌ షీట్లను డౌన్‌లోడ్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.వీటికి సంబంధించి ఏ సమస్య ఉన్నా.. హెల్ప్ లైన్ నంబర్ 040-22445566 నంబర్‌కు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

2024 డిసెంబర్ లో గ్రూప్-2 పరీక్ష నాలుగు సెషన్లలో జరిగింది. డిసెంబర్ 15 ఉదయం మధ్యాహ్నం పేపర్ 1, 2.. డిసెంబర్ 16 ఉదయం, మధ్యాహ్నం పేపర్ 3, 4 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 1368 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి. నాలుగు పేపర్ల ప్రాథమిక సమాధాన కీ, మాస్టర్ ప్రశ్నాపత్రాలను జనవరిలో అభ్యర్థి లాగిన్ ద్వారా విడుదల చేశారు.