కోల్ బెల్ట్, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాలను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ అన్నారు. బుధవారం మందమర్రి పట్టణంలోని శ్రీ మంజనాథ గార్డెన్స్ లో జరిగిన గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు.
గురుకులాల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, నూతన భవనాల నిర్మాణం కోసం ముందుకు సాగుతున్నామన్నారు. టీజీపీఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జీ ఉప్పులేటి నరేశ్ అధ్యక్షతన మంచిర్యాల జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గరిసె రవీందర్, ప్రధాన కార్యదర్శిగా బియ్యాల ఉపేందర్, ఉపాధ్యక్షులుగా కొండ సతీశ్, బొల్లం పవన్ కుమార్, కోశాధికారిగా సాగె పోచయ్య, తదితర కార్యవర్గాన్ని ఎన్నుకొని నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధార మధు, రాష్ట్ర మహిళా కో కన్వీనర్ ఉప్పులేటి గోపిక, సెక్యూరిటీ పోర్స్ కన్వీనర్ డీఎస్ నందం పాల్గొన్నారు.