హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మాదన్న పేట పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. 2022లో చంచల్ గూడ జైలు వద్ద ఎస్సీ, ఎస్టీలను కించపరచేలా వ్యాఖ్యలు చేశారంటూ బంగారు సాయిలు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరవింద్ కుమార్‌పై కేసు నమోదైంది.
నిజామాబాద్‌లో నమోదైన కేసు మాదన్నపేట పోలీసు స్టేషన్‌కు బదిలీ అయింది. ఎస్సీ, ఎస్టీలను కించపరచలేదని, నిరాధార ఆరోపణలతో నమోదైన కేసును కొట్టివేయాలంటూ అర్వింద్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. కేసు విచారణను ఎదుర్కోవాల్సిందేనని, కింది కోర్టులో తేల్చుకోవాలంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.