గ్రీన్‌‌ఫీల్డ్‌‌ రేడియల్‌‌ రోడ్డు టెండరుపై స్టేటస్‌‌కో .. ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు

గ్రీన్‌‌ఫీల్డ్‌‌  రేడియల్‌‌ రోడ్డు టెండరుపై స్టేటస్‌‌కో .. ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రావిర్యాల ఔటర్‌‌ రింగ్‌‌  రోడ్డు నుంచి ఆమనగల్‌‌ రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు దాకా మొదటి ఫేజ్‌‌లో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌‌ ఫీల్డ్‌‌ రేడియల్‌‌ రోడ్డు నిర్మాణానికి చెందిన టెండరు నోటీసుపై స్టేటస్‌‌ కో కొనసాగించాలని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  భూసేకరణ ప్రక్రియ పూర్తికాకుండానే గ్రీన్‌‌ఫీల్డ్‌‌  రేడియల్‌‌ రోడ్డు నిర్మాణం కోసం ఈనెల 24న జారీ చేసిన టెండరు నోటీసును సవాలు చేస్తూ  రవీందర్‌‌ తో పాటు మరో 9 మంది దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌‌  బి.విజయ్‌‌సేన్‌‌ రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. 

వాదనల అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. భూసేకరణ ప్రాథమిక దశలోనే ఉన్నందున గ్రీన్‌‌ఫీల్డ్‌‌ రోడ్డు నిర్మాణానికి చెందిన టెండరుపై యథాతథస్థితిని కొనసాగించాలన్నారు. హెచ్‌‌ఎండీఏ, హైదరాబాద్‌‌ గ్రోత్‌‌ కారిడార్‌‌ లిమిటెడ్, రంగారెడ్డి కలెక్టర్‌‌కు నోటీసులిస్తూ.. కౌంటర్  దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను ఏప్రిల్‌‌ 15కు వాయిదా వేశారు.