కేసీఆర్‌‌పై రైల్ రోకో కేసు కొట్టివేత.. తీర్పు వెలువరించిన హైకోర్టు

కేసీఆర్‌‌పై రైల్ రోకో కేసు కొట్టివేత.. తీర్పు వెలువరించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ చీఫ్ కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నమోదైన రైల్‌‌‌‌‌‌‌‌ రోకో కేసును గురువారం హైకోర్టు కొట్టివేసింది. రైల్‌‌‌‌‌‌‌‌ రోకో సందర్భంగా రైల్వే పోలీసులు 2011లో దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో రైల్‌‌‌‌‌‌‌‌ రోకోకు పిలుపునిచ్చారన్న ఆరోపణ తప్ప మరెలాంటి ఆధారాలు లేవన్నారు. ఫిర్యాదుదారుడితో పాటు ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలంలో రైల్‌‌‌‌‌‌‌‌ రోకోలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నట్లు ఎవరూ చెప్పలేదని వెల్లడించారు. ఈ కేసులో పిటిషనర్‌‌‌‌‌‌‌‌ పాత్రను నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.