ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సింగిల్‌ జడ్జి తీర్పును శాసనసభ కార్యదర్శి సవాలు చేస్తూ వేసిన రెండు అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించనుంది. ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై 4 వారాల్లో విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేయాలని సెప్టెంబర్‌ 9న సింగిల్‌ జడ్జి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి తీర్పు చెప్పారు.

ఆ తీర్పును రద్దు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు దాఖలు చేసిన రెండు అప్పీల్‌ పిటిషన్లపై జస్టిస్‌ అలోక్‌ అరాథే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తీర్పును రిజర్వు చేసింది. శుక్రవారం ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.