ఒకే ఒక్కడు!..తెలంగాణ బిడ్డకు ప్రెసెడెంట్ గ్యాలంటరీ మెడల్

ఒకే ఒక్కడు!..తెలంగాణ బిడ్డకు ప్రెసెడెంట్ గ్యాలంటరీ మెడల్
  • మనహెడ్ కానిస్టేబుల్ కు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్
  • ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు వరించిన అవార్డు 
  • దేశ వ్యాప్తంగా 1037 మందికి రాషట్‌రపతి సేవా పతకాలు
  • పతకాలు పొందిన వారిలో  తెలంగాణ 21 మంది, ఏపీ నుంచి 25 మంది 
  • ఏడీజీ సంజయ్ కుమార్ జైన్ కు రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారం

హైదరాబాద్: ధైర్యసాహసాలు ప్రదర్శించి చైన్  స్నాచర్లను పట్టుకున్న తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. ప్రెసిడెంట్ గ్యాంలంటరీ మెడల్ కు ఎంపికయ్యాడు మన హెడ్ కానిస్టేబుల్ చదువుల యాదయ్య. సైబరాబాద్ కమిషనరేట్లోని గచ్చిబౌలి, కూకట్పల్లి ,రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ నిరంజన్‌ నీలంపల్లి, రాహుల్‌ ను పట్టుకోవడంలో ఆయన చూపిన తెగువకు ఈ అవార్డు సొంతమైంది. జూలై 26, 2022న గుల్బర్గా నుంచి బైక్పై ఈ ఇద్దరు చైన్ స్నాచర్లు  మియపూర్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు.

రు బీహెచ్ఈఎల్ మీదుగా పారిపోయే ప్రయత్నం చేయగా.. హెడ్ కానిస్టేబుల్ చదువుల యాదయ్య సాహసాన్ని ప్రదర్శించారు. ఆ క్రమంలో నిందితులు యాదయ్యపై దారుణంగా కత్తితో పలు మార్లు దాడి చేశారు. ప్రాణాల్ని ఫణంగా పెట్టి నిందితుల్ని పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ యాదయ్య 17 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన ధైర్య సాహాసాల్ని కేంద్రం కొనియాడింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్యాలంటరీ అవార్డ్‌ను ప్రదానం చేస్తున్నట్టు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఈ అవార్డుకు యాదయ్య ఒక్కరే ఎంపిక కావడం విశేషం. 

1037 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  దేశవ్యాప్తంగా 1037 మందికి రాష్ట్రపతి పోలీస్‌ సేవా పతకాలను కేంద్రం ప్రకటించింది. యాదయ్య ఒక్కరికే పీజీఎం దక్కింది.  208 మందికి పోలీసులకు గ్యాలంటరీ పతకాలు, 75 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 624 మందికి పోలీసు సేవా పతకాలను అనౌన్స్ చేసింది. ఏపీ నుంచి 25 మంది, తెలంగాణ నుంచి 21 మందికి పోలీసు పతకాలు దక్కాయి. ఏపీ నుంచి ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ఠ సేవా పతకం, నలుగురికి పోలీస్‌ గ్యాలంటరీ పతకాలు, 19 మందికి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి.

లంగాణకు చెందిన ఒకరికి ప్రెసిడెంట్ గ్యాలంటరీ పతకం, ఏడుగురికి పోలీస్‌ గ్యాలంటరీ, 11 మందికి పోలీస్‌ సేవా పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి.  తెలంగాణ నుంచి అడిషనల్ డైరెక్టర్  జనరల్ సంజయ్ కుమార్ జైన్ కు, డిప్యూటీ కమిషనర్ కటకం మురళీధర్ కు రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారాలకు ఎంపికయ్యారు. గ్యాలంటరీ మెడల్ కు ఐపీఎస్ అధికారి సునీల్ దత్, డిప్యూటీ అసాల్ట్ కమాండర్ మోర కుమార్, అసిస్టెంట్ అసాల్ట్ కమాండర్ శనిగరపు సంతోష్, జూనియర్ కమాండోలు అమిలి సురేశ్, వేముల వంశీ, కాంపాటి ఉపేందర్, పాయం రమేశ్ ఎంపికయ్యారు.  

ఉత్తమ ప్రతిభా పురస్కారాలకు 11 మంది

ఉత్తమ ప్రతిభా పురస్కారాలకు తెలంగాణ నుంచి 11 మంది ఎంపికయ్యారు. ఏపీ నుంచి 16 మంది ఎంపికైనట్లు కేంద్రం ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి సీబీఐ హెడ్ కానిస్టేబుల్ సాది రాజురెడ్డి, లీడింగ్‌ ఫైర్‌మెన్‌లు తెలుగు మాధవరావు, మహ్మద్‌ వహీయుద్దీన్‌ ఎంపికైనట్టు కేంద్రం తెలిపింది.