హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో మొబైల్ టెస్టింగ్ వెహికిల్స్ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఎక్కడైనా ఫుడ్ కల్తీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘హైదరాబాద్ అంటే బిర్యాని గుర్తుకు వస్తుంది. నాచారంలోని ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను ఆధునీకరించడంతో పాటు మరో 4 లేదా 5 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తం. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్, ప్రభుత్వ హాస్టల్స్ లో మంచి ఫుడ్ అందించాలి. చిన్న,పెద్ద హోటల్స్ నడిపే వారు రిజిస్ట్రేషన్, లైసెన్స్ తీసుకోవాలి. మంచిగా హోటల్స్ నడుపుకుంటే..ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’ అని హామీ ఇచ్చారు.