
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు ( ఏప్రిల్ 24, 25) భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఐఎండీ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకు ఎండల తీవ్రత భారీగా పెరుగుతుంది. ఇక, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. .
ఆదిలాబాద్, కోమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో రెడ్ అలెర్ట్ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఇక సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉందని తెలియజేశారు
రెడ్ అలెర్ట్ జారీ చేసిన తొమ్మిది జిల్లాలకు మినహా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. పెరుగుతున్న రాత్రి పూట ఉష్ణోగ్రతలతో తీవ్ర ఉక్కపోత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడ గాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొనింది. ఇక, వడ దెబ్బ ప్రభావంతో మరణాలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది అని హెచ్చరించారు. కాబట్టి అవసరం ఉంటేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు.