Pushpa 2 The Rule: పుష్ప మూవీ అయితే రిలీజ్ చేసుకోండి.. ఆ డబ్బుల లెక్కలు మాత్రం చెప్పాల్సిందే : హైకోర్టు

Pushpa 2 The Rule: పుష్ప మూవీ అయితే రిలీజ్ చేసుకోండి.. ఆ డబ్బుల లెక్కలు మాత్రం చెప్పాల్సిందే : హైకోర్టు

Pushpa 2 The Rule: టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 : ది రూల్ సినిమా  డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చింది. అంతేగాకుండా సినిమా బడ్జెట్ ని బట్టి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. 

నిర్మాతలు బెనిఫిట్ షోలకి రూ.800 అదనంగా చెల్లించాలని ధరలు నిర్ణయించారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందంగానే ఉన్నప్పటికీ సతీష్ అనే వ్యక్తి అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశాడు. అంతేగాకుండా పుష్ప 2 సినిమా రిలీజ్ ని ఆపాలని కోరాడు.

దీంతో సతీష్ పిటీషన్ ని ఈరోజు (మంగళవారం, నవంబర్ 03) హైకోర్టు విచారణ జరిపింది. ఇందులోభాగంగా పిటీషనర్ తరుపు న్యాయవాది పుష్ప 2 బెనిఫిట్ షో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, అలాగే షో టైమింగ్స్ కూడా అర్థరాత్రి 1 గంటకిమించి ఉన్నాయని దీంతో నిద్ర ఆరోగ్యం వంటివి దృష్టిలో ఉంచుకుని పుష్ప 2 సినిమా విడుదలని ఆపాలని వాదించాడు. 

మేకర్స్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ బెన్ఫిట్ షో ధరలు బడ్జెట్ ఆధారంగానే నిర్ణయించామని, అలాగే బెనిఫిట్ షోస్ కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మాత్రమేనని చిన్నపిల్లలు, ఫ్యామిలీలు వచ్చే అవకాశం చాల తక్కువగా ఉంటుందని కాబట్టి రిలీజ్ ని ఆపవద్దని కోరాడు.

ALSO READ : Pushpa 2: The Rule Effect: దేశం మొత్తంలో పుష్ప ఒక్కటే రిలీజ్ : మిగతా అన్ని సినిమాలు వాయిదా

దీంతో ఇరువురి వాదనలు విన్న కోర్టు వారు సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో రిలీజ్ ఆపడం కుదరదని స్పష్టం చేసింది. అలాగే బడ్జెట్ తో పాటూ బెనిఫిట్ షో కలెక్షన్స్ వివరాలని తదుపరి వాయిదాలో కోర్టుకి సమర్పించాలని మేకర్స్ కి ఆదేశాలు జారే చేసింది. దీంతో పుష్ప 2 రిలీజ్ కి తాత్కాలికంగా అడ్డంకులు తొలగిపోయాయాని చెప్పవచ్చు.