ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులు రాధాకిషన్, భుజంగరావులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా నిందితులకు లక్ష రూపాయలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. అదేవిధొంగా పాస్ పోర్టులు సమర్పించాలని సూచించింది. ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించాలని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం రాధాకిషన్, భుజంగరావులకు బెయిల్ మంజూరు చేయడంతో ప్రణీత్ రావు మత్రమే జైల్లో ఉన్నారు. మిగతా నిందితులందరికీ బెయిలు మంజూరయ్యింది.
అంతకు మందు ఇదే కేసులో సస్పెండైన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.