వందేళ్లు పూర్తి చేసుకున్న హైకోర్టు : శతాబ్ధి ఉత్సవానికి సిద్ధం

వందేళ్లు పూర్తి చేసుకున్న హైకోర్టు : శతాబ్ధి ఉత్సవానికి సిద్ధం

హైదరాబాద్ : వందేళ్లు.. నెంబర్ వింటుంటేనే.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సెంటెనరీ వేడుకల తర్వాత.. హైదరాబాద్ లో మళ్లీ అలాంటి తరుణమే వచ్చింది. నేటితో.. తెలంగాణ హైకోర్టు భవనం వందేళ్లు పూర్తి చేసుకుంది. శతాబ్ది వేడుకలకు సిద్ధమైంది. సెంటెనరీ సెర్మనీకి.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  రాఘవేంద్ర సింగ్ చౌహాన్ .. ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సాయంత్రం జరిగే.. శతాబ్ది వేడుకలకు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్  ఎన్ .వి.రమణ, జస్టిస్  ఆర్ .సుభాష్ రెడ్డి, జస్టిస్  లావు నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

హైకోర్టు భవనానికి వందేళ్లు పూర్తవవడంపై.. తెలంగాణ లాయర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అరుదైన భవనాల్లో.. హైకోర్టు ఒకటని చెప్తున్నారు. వందేళ్లైనా.. ఇంకా భవనం చెక్కుచెదరలేదంటే.. అది కేవలం నిజాం కాలంలో పాటించిన నిర్మాణ విలువలే అంటున్నారు. హైకోర్టు శతాబ్ది ఉత్సవాల వేళ.. న్యాయవాదులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్  ఏడో నిజాం మీర్  ఉస్మాన్  అలీఖాన్ .. 1920 ఏప్రిల్  20న హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. జైపూర్ కు చెందిన ఇంజినీర్, ఆర్కిటెక్ట్ శంకర్ లాల్ హైకోర్టు నమూనాను తయారుచేస్తే.. హైదరాబాద్  ఇంజినీర్ మెహర్ అలీ ఫజల్ నిర్వహణ బాధ్యతలు చూశారు. మొత్తం 18 లక్షల 22 వేల అంచనా వ్యయంతో హైకోర్టు భవన నిర్మాణ కాంట్రాక్ట్ ను దక్కించుకున్న నవరతన్ దాస్… ఇండో ఇస్లామిక్ సంప్రదాయరీతిలో హైకోర్టును నిర్మించారు. 1915 ఏప్రిల్  15న ప్రారంభమైన ఈ భవననిర్మాణం 1919 మార్చి 31 నాటికి పూర్తయ్యింది. కానీ.. 1920 ఏప్రిల్  20న అధికారికంగా హైకోర్టును ప్రారంభించారు. హైదరాబాద్ చారిత్రక సంపదకు, నిజాం కాలంనాటి అద్భుత నిర్మాణ కౌశలానికి ఈ భవనం అద్దం పడుతోంది.