అక్కినేని-నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితం సక్రమంగా సాగదంటూ జాతకం చెప్పిన వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు. నాగచైతన్య- శోభిత నిశ్చితార్థం చేసుకున్నరోజునే రంగంలోకి దిగిన వేణుస్వామి మూడేళ్లలో వీరిద్దరూ విడిపోతారని జోస్యం చెప్పారు. మరో మహిళ ప్రమేయం కారణంగా 2027లో ఈ జంట విడిపోతారని అంచనా వేసి వివాదానికి తెరలేపారు. ఈ మేరకు వీరిద్దరి జాతకాలను వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది.
దీనిపై తెలుగు ఫిల్మ్ జర్న లిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసి యేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు.. మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది తెలిసిందే. అయితే కమిషన్కు ఆ అధికారం లేదంటూ వేణు స్వామి స్టే తెచ్చుకున్నారు.
ఇవాళ సోమవారం అక్టోబర్ 28న ఆ స్టే ఎత్తివేస్తూ మహిళా కమిషన్కు పూర్తి అధికారాలు ఉన్నాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వారం రోజుల్లో వేణుస్వామిపై తదుపరి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌కు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వేణు స్వామిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
2024 ఆగస్టులో తెలుగు ఫిల్మ్ జర్న లిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో.. కొంతమంది జర్నలిస్టులు.. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వేణుస్వామిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద.. వేణుస్వామిపై, సదరు వీడియోలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెళ్లపై విచారణ చేసి తప్ప కుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో మంగళవారం(ఆగష్టు 13న ) రాష్ట్ర మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది. ఇక నేడు అక్టోబర్ 28న తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మహిళా కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.