
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యాసంస్థలను డీమ్డ్ యూనివర్సిటీలుగా అనుమతించడంపై వివరణ ఇవ్వాలంటూ యూజీసీకి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. డీమ్డ్ యూనివర్సిటీల అనుమతికి సంబంధించి యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిని తాత్కాలిక ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారించింది. యూజీతోపాటు డీమ్డ్ యూనివర్సిటీలుగా గుర్తింపు పొందిన పలు యూనివర్సిటీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.