స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమీషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన హైకోర్టు... ఈ మేరకు రెండు వారాల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ బాధ్యతలు బీసీ కమిషన్ కు అప్పగించటం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది హైకోర్టు.

అయితే.. బీసీ రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలని బీసీ సంఘాలు సహా, పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు కీలకంగా మారాయి.