Vishnu Priya: అది కుదరదంటూ యాంకర్ విష్ణు ప్రియకి షాక్ ఇచ్చిన హైకోర్టు...

Vishnu Priya: అది కుదరదంటూ యాంకర్ విష్ణు ప్రియకి షాక్ ఇచ్చిన హైకోర్టు...

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో తెలుగు యాంకర్ విష్ణుప్రియపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మధ్య విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకి వెళ్ళింది. అయితే విచారణ అనంతరం పోలీసులు విషు ప్రియ కాల్ డేటా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ తాలూకా వివరాల గురించి ఎంక్వైరీ చేశారు. అయితే యాంకర్ విష్ణు ప్రియ ఈ విచారణ అనంతరం తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లను కొట్టి వెయ్యాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసింది.

ALSO READ | బాలీవుడ్ లో శ్రీలీలకి షాక్.. ఆ స్టార్ హీరోయిన్ కూతుర్ని తీసుకున్నారా.?

దీంతో ఈ  క్వాష్ పిటీషన్ ని పరిశీలించిన హైకోర్టు విచారణ పూర్తయ్యేంతవరకూ రెండు ఎఫ్ఐఆర్ లను కొట్టి వెయ్యడం కుదరదని స్పష్టం చేసింది. కానీ విష్ణు ప్రియ ను అరెస్టు చేయొద్దని, 35(3) బిఎన్ఎస్ఎస్  ఫాలో కావాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పోలీసుల విచారణకి విష్ణు ప్రియ సహకరించాలని ఆదేశించింది. అరెస్టుని తాత్కాలికంగా నిలిపివెయ్యడంతూ విష్ణుప్రియకి కొంతమేర ఊరట లభించిందని చెప్పవచ్చు. 

ఈ విషయం ఇలా ఉండగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో ఇప్పటివరకూ దాదాపుగా 35మందికిపైగా సినీ సెలెబ్రెటీలు, సోషల్ మీడియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇందులో ఇటీవలే యాంకర్ విష్ణు ప్రియతోపాటూ మరో యాంకర్ రీతూ చౌదరి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకి హాజరైంది.