కేసీఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ.. పిటీషన్ కొట్టివేత

కేసీఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ.. పిటీషన్ కొట్టివేత

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో.. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జరిగిన అవకతవకలు, విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి సంబంధించి.. సీఎం రేవంత్ రెడ్డి ఆద్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నర్సింహారెడ్డి జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి స్వయంగా హాజరయ్యి.. విచారణ ఎదుర్కోలంటూ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది కమిషన్. ఈ నోటీసులను, కమిషన్ ను సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు కేసీఆర్. 

కేసీఆర్ పిటీషన్ పై 2024, జూలై ఒకటో తేదీన విచారణ చేసిన హైకోర్టు.. కేసీఆర్ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది. విచారణ ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. కమిషన్ ఏర్పాటును సమర్థించింది హైకోర్టు.