లగచర్ల ఘటన: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. క్వాష్ పిటిషన్ కొట్టివేత

లగచర్ల ఘటన: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. క్వాష్ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు బుధవారం(డిసెంబర్ 4, 2024) కొట్టివేసింది.

లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రిమాండ్ను డిసెంబర్ 11 వరకు పొడిగిస్తూ కొడంగల్ జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ కోసం రైతుల అభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చెయ్యగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారంతో(నవంబర్ 27) 14 రోజుల రిమాండ్ ముగియడంతో కొడంగల్ మేజిస్ట్రేట్ మరో 14 రోజులు రిమాండ్ పొడిగించారు. 

Also Read :- గోల్డెన్ టెంపుల్లో సుఖ్ బీర్ సింగ్ బాదల్పై కాల్పులు

ఫార్మా పరిశ్రమ భూసేకరణ కోసం ఎవరొచ్చినా తరిమికొడదామని, బీఆర్ఎస్​​పార్టీతోపాటు కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావు  అండగా ఉంటారని కొడంగల్ ​మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వికారాబాద్​కలెక్టర్పై దాడికి రెండు రోజుల ముందు రోటిబండ తండాలో ఆయన రైతులను రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్​అయింది.

‘‘గ్రామానికి కాంగ్రెస్​ నాయకులు, సీఎం, కలెక్టర్.. ఎవ్వరొచ్చినా తరిమికొడ్దాం. బీఆర్ఎస్ ​పార్టీ మనకు అండగా ఉంటది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావు కూడా అండగా ఉంటరు. నిన్ననే కేటీఆర్​తోని మీటింగ్​ పెట్టి మాట్లాడినా’’ అంటూ పట్నం నరేందర్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. ప్రస్తుతం నరేందర్​రెడ్డి  కలెక్టర్పై దాడి కేసులో ఏ1గా చర్లపల్లి జైలులో రిమాండ్లో ఉన్నారు.