ప్రజాప్రతినిధులపై కేసులు.. కౌంటర్కు నాలుగు వారాల టైం ఇచ్చిన హైకోర్ట్

ప్రజాప్రతినిధులపై కేసులు.. కౌంటర్కు నాలుగు వారాల టైం ఇచ్చిన హైకోర్ట్

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ పురోగతిపై మార్చి 21న  తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక ధర్మాసనం సుమోటోగా విచారిస్తోంది .  హరిరామజోగయ్య దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కలిపి విచారించింది కోర్టు.  జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను వేగంగా విచారించాలని  హరిరామజోగయ్య పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే..

ALSO READ | షాకింగ్ కేసు..సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం..రాజ్యసభ చైర్మన్

మార్చి21న విచారణ సందర్భంగా రాష్ట్రంలోని పలు  కోర్టులలో ప్రజాప్రతినిధులపై 309 కి కేసులున్నాయని కోర్టుకు తెలిపారు (అదనపు అడ్వొకేట్ జనరల్) ఏఏజీ.  విచారణలో పురోగతిపై కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని కోరారు.  వేగంగా విచారణ చేపట్టాలని ఇదే హైకోర్టు ఆదేశాలిచ్చిందన్న హరిరామజోగయ్య తరపు న్యాయవాది వాదించారు.  ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. మార్చి 31వ తేదీ వరకు ఉన్న అన్ని కేసుల విచారణ పురోగతిపై నాలుగు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని  ఏఏజీని ఆదేశించింది హైకోర్టు.

దేశ వ్యాప్తంగా 5 వేల కేసులు పెండింగ్

ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఒక వ్యక్తి తీవ్రమైన నేరాల్లో దోషిగా తేలితే అతడిని పదవి నుంచి తొలగించవచ్చు. కానీ  అమలు విషయంలో మనం  జాప్యం  చూస్తున్నాం.  ఇప్పటికీ  దేశవ్యాప్తంగా 5,000కు పైగా నేరపూరిత చరిత్ర కలిగిన ప్రజా ప్రతినిధుల కేసులు వివిధ కోర్టులలో పెండింగ్​లో ఉన్నాయి. దీన్ని గమనిస్తే  ప్రజాప్రాతినిధ్య చట్టం ఎంత పటిష్టవంతంగా అమలవుతుందో  అర్థం అవుతుంది. 2018లోనే  ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నేరపూరిత  కేసులను త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు సూచనతో 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసినప్పటికీ కేసులు పరిష్కారంలో చాలా జాప్యం  జరుగుతోంది.